శ్రీసుదర్శన అష్టోత్తరశతనామస్తోత్రమ్
సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః .
సహస్రబాహుర్దీప్తాఙ్గః అరుణాక్షః ప్రతాపవాన్ ..1..
అనేకాదిత్యసఙ్కాశః ప్రోద్యజ్జ్వాలాభిరఞ్జితః .
సౌదామినీసహస్రాభః మణికుణ్డలశోభితః ..2..
పఞ్చభూతమనోరూపో షట్కోణాన్తరసంస్థితః .
హరాన్తః కరణోద్భూతరోషభీషణవిగ్రహః ..3..
హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః .
శ్రాకారరూపస్సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః ..4..
చతుర్దశసహస్రారః చతుర్వేదమయోఽనలః .
భక్తచాన్ద్రమసజ్యోతిః భవరోగవినాశకః ..5..
రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాఙ్గకః .
సర్వదైత్యగ్రీవనాలవిభేదనమహాగజః ..6..
భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా విలోచనః .
నీలవర్త్మా నిత్యసుఖో నిర్మలశ్రీర్నిరఞ్జనః ..7..
రక్తమాల్యాంబరధరో రక్తచన్దనరూషితః .
రజోగుణాకృతిశ్శూరో రక్షఃకులయమోపమః ..8..
నిత్యక్షేమకరః ప్రాజ్ఞః పాషణ్డజనఖణ్డనః .
నారాయణాజ్ఞానువర్తీ నైగమాన్తఃప్రకాశకః ..9..
బలినన్దనదోర్దణ్డఖణ్డనో విజయాకృతిః .
మిత్రభావీ సర్వమయో తమోవిధ్వంసకస్తథా ..10..
రజస్సత్త్వతమోద్వర్తీ త్రిగుణాత్మా త్రిలోకధృత్ .
హరిమాయాగుణోపేతోఽవ్యయోఽక్షస్వరూపభాక్ ..11..
పరమాత్మా పరంజ్యోతిః పఞ్చకృత్యపరాయణః .
జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజఃప్రభామయః ..12..
సదసత్పరమః పూర్ణో వాఙ్మయో వరదోఽచ్యుతః .
జీవో గురుర్హంసరూపః పఞ్చాశత్పీఠరూపకః ..13..
మాతృకామణ్డలాధ్యక్షో మధుధ్వంసీ మనోమయః .
బుద్ధిరూపశ్చిత్తసాక్షీ సారో హంసాక్షరద్వయః ..14..
మన్త్రయన్త్రప్రభావజ్ఞో మన్త్రయన్త్రమయో విభుః .
స్రష్టా క్రియాస్పదశ్శుద్ధః ఆధారశ్చక్రరూపకః ..15..
నిరాయుధో హ్యసంరమ్భః సర్వాయుధసమన్వితః .
ఓమ్కారరూపీ పూర్ణాత్మా ఆంకారస్సాధ్యబన్ధనః ..16..
ఐంకారో వాక్ప్రదో వగ్మీ శ్రీంకారైశ్వర్యవర్ధనః .
క్లీంకారమోహనాకారో హుంఫట్క్షోభణాకృతిః ..17..
ఇన్ద్రార్చితమనోవేగో ధరణీభారనాశకః .
వీరారాధ్యో విశ్వరూపః వైష్ణవో విష్ణురూపకః ..18..
సత్యవ్రతః సత్యధరః సత్యధర్మానుషఙ్గకః
నారాయణకృపావ్యూహతేజశ్చక్రస్సుదర్శనః ..19..